భారతీయ సినిమా అంటే బాలీవుడే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మిగతా ప్రాంతాల్లో వచ్చే చిత్రాలపై కాస్త చిన్నచూపు చూపిస్తుంటారనేది చాలా మంది వాదన. ప్రస్తుతం ఈ వీడియో చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. హీరో రానాను ఇంటర్వ్యూ చేసిన ఓ యువతి... దక్షిణాది చిత్రాలను తక్కువచేసేలా మాట్లాడుతూ ప్రశ్నలు అడిగింది. దీనికి ఘాటుగా బదులిచ్చాడు రానా.
యువతికి హీరో రానా ఘాటు జవాబు..!
దక్షిణాది చిత్రాల గురించి తక్కువ చేసి మాట్లాడిన యువతికి ఘాటుగా బదులిచ్చాడు హీరో రానా. సినిమాలకు భాషలు అడ్డుగోడలు కాదంటూ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
రానా
'మిగతా రాష్ట్రాల గురించి పరిణతి లేకుండా భారతీయులు ఎలా ఆలోచిస్తున్నారో అర్థమవుతోంది. చాలా మంది సాంకేతిక నిపుణులు, నటీనటులతో కలిపి రూపొందించేది సినిమా. రజినీ కాంత్‌కు భారత్ మొత్తం గుర్తింపు ఉంది. అవెంజర్స్ లాంటి సినిమాలు మిగతా భాషాల్లోనూ విడుదలవుతున్నాయి. మీరు అడ్డుగోడలు నిర్మించుకుంటే తప్ప సినిమాకు హద్దులు లేవు' అంటూ ఘాటుగా బదులిచ్చాడు రానా.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. సరైన సమాధానమిచ్చాడంటూ నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.
Last Updated : Jun 22, 2019, 7:17 PM IST