టాలీవుడ్ కథానాయకుడు రానా.. మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. మిహిక బజాజ్‌ను పరిణయమాడనున్నాడు. ఈ నేపథ్యంలో సంప్రదాయ దుస్తుల్లో నాన్న (సురేష్ బాబు), బాబాయ్ (వెంకటేశ్)లతో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. 'రెడీ' అనే క్యాప్షన్ జోడించారు.
కరోనా నెగిటివ్ వస్తేనే రానా పెళ్లికి!
వివాహానికి సిద్ధమైన ప్రముఖ కథానాయకుడు రానా.. నాన్న, బాబాయ్‌లతో దిగిన ఫొటోను పంచుకున్నారు. నేను సిద్ధమయ్యానంటూ క్యాప్షన్ పెట్టారు.
రానా
రామానాయుడు స్టూడియోస్‌లో శనివారం(ఆగస్టు 8) జరిగే ఈ కార్యక్రమానికి కేవలం 30 మంది అతిథులు మాత్రమే హాజరుకానున్నారు. వచ్చే ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు జరిపిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని, భౌతిక దూరం కచ్చితంగా పాటిస్తామని రానా తండ్రి సురేష్ బాబు ఇప్పటికే చెప్పారు.
Last Updated : Aug 8, 2020, 3:26 PM IST