'బాహుబలి' సిరీస్‌లో శివగామి పాత్రలో అదరగొట్టిన నటి రమ్యకృష్ణ.. ఆ తర్వాత పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ, పేరు తెచ్చుకుంటోంది. ఇప్పుడు ఆమెకు, బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కుతున్న మరో రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయట. అందులో వరుణ్‌తేజ్, విజయ్ దేరవకొండ చిత్రాలున్నాయి.
'బాక్సర్' పేరుతో తీస్తున్న చిత్రంలో మెగాహీరో వరుణ్‌తేజ్‌కు తల్లిగా నటించనుందట రమ్యకృష్ణ. దీనితో పాటే పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలోనూ ఈమె హీరోకు అమ్మ పాత్రలో కనిపించనుందట. ఈ విషయంపై అధికారిక ప్రకటనలు వస్తే గానీ, అసలు విషయం తెలియదు.