తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కంగన సినిమాలో అయోధ్య రామ మందిర చరిత్ర​!

బుధవారం అయోధ్య రామ మందిర భూమి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా బాలీవుడ్​ హీరోయిన్​ కంగనా రనౌత్ స్పందిస్తూ.. తన తదుపరి చిత్రంలో రామ మందిర చరిత్రకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు స్పష్టం చేసింది.

Ram Mandir bhoomi pujan will be a part of Aparajita Ayodhya
కంగనా

By

Published : Aug 5, 2020, 9:25 PM IST

అయోధ్యలో రామ మందిర భూమి పూజ సందర్భంగా.. బాలీవుడ్​ హీరోయిన్​ కంగనా రనౌత్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తన దర్శకత్వంలో రానున్న తదుపరి చిత్రం 'అపరాజిత అయోధ్య'లో రామ మందిరానికి సంబంధించి ఆరు శతాబ్దాల చరిత్రను తెరకెక్కించాలని నిర్ణయించినట్లు ట్విట్టర్​ వేదికగా తెలిపింది.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 600 ఏళ్ల నాటి పురాతన ఆలయాల చరిత్రపై ఓ సినిమా రూపొందించనున్నట్లు కంగన స్పష్టం చేసింది. తాజాగా, రామ మందిర భూమి పూజకు సంబంధించిన సన్నివేశాలనూ అందులో చేర్చనున్నట్లు వివరించింది. ఈ చిత్రాన్ని 'భక్తి, విశ్వాసం, ఐక్యత ' కథగా పిలవనున్నట్లు పేర్కొంది.

"నా చిత్రంలో రామ మందిరానికి అనుకూలంగా పోరాడిన అనేక మంది నిజమైన ముస్లిం పాత్రలు ఉన్నాయి. రామ రాజ్యం మతానికి అతీతమైంది. అదే 'అపరాజిత అయోధ్య'లో కనిపిస్తుంది. 600 ఏళ్లనాటి చరిత్రను చిత్రీకరించడానికి స్క్రీన్​ ప్లే ఎంతో కష్టంగా ఉంటుంది. కె.వి. విజయేంద్ర ప్రసాద్​ ఈ కథను అందంగా మలిచారు. త్వరలోనే షూటింగ్​ ప్రారంభించాలని అనుకుంటున్నాం."

-కంగనా రనౌత్​, సినీ నటి

ఈ చిత్ర కథను 'బాహుబలి' స్క్రిప్ట్​ రైటర్​ విజయేంద్ర ప్రసాద్​ రాశారు. కంగన స్వీయ నిర్మాణం చేపడుతోంది. మరోవైపు బుధవారం అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ పునాదిరాయి వేశారు. ఈ క్రమంలోనే కంగన సంతోషం వ్యక్తం చేసింది.

ABOUT THE AUTHOR

...view details