సినిమాలతో పాటు, సామాజిక మాధ్యమాల వేదికగా పెట్టే పోస్టులతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (RGV). ఇప్పుడు 'క్రాక్' ఐటెంగాళ్(Krack Item Girl) అప్సర రాణితో కలిసి ఓ పబ్‌లో చిందులేశాడు. దాంతో ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ట్విట్టర్ వేదికగా వరుసగా పోస్ట్ చేస్తూ వచ్చాడు. అయితే ఆ పబ్‌లో వాళ్లిద్దరూ ఏం చేశారు? అనే నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Viral: 'క్రాక్' బ్యూటీతో పబ్‌లో ఆర్జీవీ రచ్చ రచ్చ..! - రామ్ గోపాల్ వర్మ అప్సరారాణి
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు, సినిమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma). ఇప్పుడు 'క్రాక్' ఐటెంగాళ్(Krack Item Girl) అప్సర రాణి అందాన్ని ట్విట్టర్ వేదికగా వర్ణించాడు. ఆమెతో పాటు ఓ పబ్‌కు వెళ్లి డీజే పాటకు సరదాగా చిందులేశాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఆ మధ్య 'బోల్డ్ ఇంటర్వ్యూ' (RGV interview) అంటూ అరియానాతో వర్మ చేసిన సందడి చూశాం. ఇటీవలే బిగ్‌బాస్ కంటస్టెంట్ అషురెడ్డితో అలాంటి ఓ ఇంటర్వ్యూనే ప్లాన్ చేశాడు. కానీ, ఈసారి కొత్తగా 'క్రాక్' ఐటెంగాళ్ అప్సర రాణితో కలిసి సరదాగా పబ్‌కు వెళ్లాడు. వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలతో పాటు డీజే సాంగ్‌కు ఆమె చిందులేసిన వీడియోలను ట్విట్టర్లో పంచుకున్నాడు. దానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇదీ చూడండి..రామ్‌గోపాల్ వర్మ చెంప పగలగొట్టిన నటి!