తెలంగాణ

telangana

By

Published : May 26, 2019, 7:31 PM IST

ETV Bharat / sitara

వర్మ కొత్త సినిమా టైటిల్ ఇదే..!

దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో కొత్త సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. విజయవాడ నేపథ్యంలో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే టైటిల్​తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పాడు.

వర్మ కొత్త సినిమా టైటిల్ ఇదే..!

ఎప్పుడూ వివాదాల చుట్టూ ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆదివారం విజయవాడలో విలేకరులు సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు చర్చించాడు. తర్వాతి చిత్రం ఏంటనే విషయంపై స్పష్టతనిచ్చాడు.
విజయవాడకు వచ్చిన తరువాత తాను చూసిన దృశ్యాల స్ఫూర్తితోనే ఈ కొత్త కథ రాసుకోనున్నట్లు చెప్పాడు. అందుకే సినిమాకు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్‌ను పెడుతున్నట్లు ప్రకటించాడు.

రాంగోపాల్ వర్మ ట్వీట్
అతడు తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మే 31న ఆంధ్రప్రదేశ్​లో విడుదల కానుంది. యజ్ఞాశెట్టి, విజయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. మిగతా చోట్ల ఇంతకు ముందే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details