హనుమకొండ జిల్లా కేంద్రంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) సందడి చేశారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా రాంగోపాల్ వర్మ తీస్తున్న కొండా బయోపిక్(konda movie launch news) షూటింగ్ కోసం హనుమకొండకు వచ్చారు. ఈ సందర్భంగా వర్మకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ మంత్రి కొండా సురేఖ ఘన స్వాగతం పలికారు. వంచనగరిలో కొండా బయోపిక్‌ను ప్రారంభించడానికి వారు బయలుదేరారు. వర్మ రాకతో స్థానికంగా సందడి నెలకొంది. హనుమకొండకు వచ్చిన వర్మను చూడడానికి ఆయన అభిమానులు తరలివచ్చారు.
'తెలంగాణ రక్తచరిత్ర'
వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma Latest News). హారర్, ఫ్యాక్షనిజం, రౌడీయిజం నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కించారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచిన మాట అటుంచితే.. ఈ కథాంశాలతోనే వర్మ మరింత పాపులర్ అయ్యారు. విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో సాగే 'రక్త చరిత్ర' సినిమా తీసిన ఆర్జీవీ ఇప్పుడు 'తెలంగాణలో జరిగిన రక్తచరిత్ర'పై సినిమా తీస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఓ వాట్సాప్ ఆడియో గతంలో వైరల్ అయింది.
గతంలో క్లారిటీ
వరంగల్ ములుగు రోడ్‌లోని ఎల్బీ కళాశాలకు వెళ్లిన వర్మ... ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చారు. కొండా మురళి దంపతుల(RGV Konda Murali) కథాంశంతో తాను తీయబోయే సినిమా కోసమే వరంగల్ వెళ్లినట్లు తెలిపారు. అయితే.. వైరల్ అయిన ఆ ఆడియోలో సినిమాకు సంబంధించిన అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చారు వర్మ. ఈ సినిమా ఎందుకు తీయాలనుకుంటున్నారో వివరించారు.