తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యూట్యూబ్​లో 'ఆర్​ఆర్ఆర్' టీజర్ రికార్డు - టీజర్​తోనే యూట్యూబ్​లో సరికొత్త రికార్డు సృష్టించిన చెర్రీ

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్​ఆర్ఆర్​' చిత్రానికి సంబంధించిన టీజర్​ యూట్యూబ్​లో రికార్డు సృష్టించింది. మెగా పవర్​స్టార్ రామ్​చరణ్ పుట్టిన రోజు కానుకగా మార్చి 27న విడుదలైన 'భీమ్‌ ఫర్‌ రామరాజు' టీజర్‌ తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఇప్పటివరకూ అత్యధిక మంది వీక్షించిన టీజర్‌గా రికార్డు సొంతం చేసుకుంది.

ram charan -rrr-movie -teaser-creates-record
టీజర్​తోనే యూట్యూబ్​లో సరికొత్త రికార్డు సృష్టించిన చెర్రీ

By

Published : Oct 31, 2020, 5:50 PM IST

యూట్యూబ్​లో సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది 'ఆర్ఆర్​ఆర్'​ చిత్రం. ఇందులోని రామ్​ చరణ్​ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన 'భీమ్ ఫర్​ రామరాజు' టీజర్​ అత్యధిక మంది వీక్షించిన టీజర్‌గా ఘనత దక్కించుకుంది. విడుదలైన నాటి నుంచి ఇప్పటివరకూ ఈ టీజర్‌ను 33.3 మిలియన్ల మంది అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో వీక్షించారు.

ఎన్టీఆర్​ వాయిస్​ ఓవర్​తో

ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌తో అల్లూరి సీతారామరాజుగా స్క్రీన్​పై చెర్రీని చూసిన అభిమానులు ఫిదా అయ్యారు. టీజర్‌ అదిరిందంటూ సినీ ప్రముఖులతోపాటు ప్రేక్షకులు కామెంట్లు చేశారు.

రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'‌. ఈ సినిమా కోసం మొదటిసారి రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కలిసి పనిచేస్తున్నారు. ఇందులో చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. అలాగే చెర్రీ సరసన బాలీవుడ్‌ నటి ఆలియా, తారక్‌ సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. మరోవైపు ఇటీవల విడుదల చేసిన 'రామరాజు ఫర్‌ భీమ్‌' కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details