'కనురెప్ప వేయకుండా నటించిన ఆ క్షణం' - రైతు నేతగా సూర్య
హీరోలు సూర్య, కార్తీ పని విషయంలో ఒకేలా ఉంటారని చెప్పింది హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. 'ఎన్.జి.కె' షూటింగ్లో జరిగిన ఆసక్తికర అనుభవాలను పంచుకుంది.
'కనురెప్ప వేయకుండా నటించిన ఆ క్షణం' ఏంటో చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్
ఎన్.జి.కె సినిమా చిత్రీకరణ అనుభవాలను పంచుకుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కొన్ని సన్నివేశాల్లో కనురెప్ప వేయకుండా నటించాల్సి వచ్చిందని చెప్పింది. దర్శకుడు సెల్వరాఘవన్‌తో పనిచేయడం ఎంతో నేర్చుకునే అవకాశాన్నిచ్చిందని తెలిపింది. అలాగే హీరో సూర్య, కార్తీల గురించిన విశేషాలను వెల్లడించింది.