తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాకు అలాంటి వాడు భర్తగా కావాలి: రకుల్​

తనకు ఎలాంటి లక్షణాలున్న జీవిత భాగస్వామి కావాలో తెలిపిన హీరోయిన్​ రకుల్​ప్రీత్​ సింగ్​.. జీవితంలో ప్రేమ, పెళ్లి బంధాలను విశ్వసిస్తానని తెలిపింది. ప్రస్తుతం 'భారతీయుడు 2'తో పాటు మరో బాలీవుడ్​ చిత్రంలో నటిస్తోందీ భామ.

rakul
రకుల్​

By

Published : Jul 9, 2020, 12:04 PM IST

Updated : Jul 9, 2020, 1:33 PM IST

జీవితంలో ప్రేమ, పెళ్లిలో ఉండే మాధుర్యాన్ని తాను బలంగా నమ్ముతానంటోంది స్టార్​ హీరోయిన్​ రకుల్​ప్రీత్​ సింగ్​. కానీ ప్రజలు ఈ బంధాన్ని ఓ భారంగా ఎందుకు భావిస్తారో తనకు అర్థంకావట్లేదని తెలిపింది.

"జీవితంలో ఓ వ్యక్తిగా ఎలా వ్యవహరించాలి, ఎలా ఉండకూడదో తెలుసుకున్నా. తల్లిదండ్రుల వల్ల ప్రేమకు నిర్వచనం అర్థమైంది. జీవితంలో ఈ ప్రేమ, పెళ్లి బంధం అనేది ఎంతో మధురమైంది. ఈ విషయాన్ని సమర్థిస్తా. కానీ ప్రజలెందుకు దీన్ని ఓ భారంగా భావిస్తున్నారో అర్థం చేసుకోలేకపోతున్నా. నేను మాత్రం ఎదుటివారికి ఎంతో స్వచ్ఛమైన ప్రేమను అందిస్తా."

-రకుల్​ ప్రీతి సింగ్​.

తనకెలాంటి జీవిత భాగస్వామి కావాలో కూడా చెప్పుకొచ్చింది రకుల్​. మంచి వ్యక్తిత్వం, ఎత్తు, ముఖ్యంగా తెలివితేటలు ఉండాలని తెలిపింది. జీవితంలో అతడికంటూ కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని వాటికోసం కృషి చేయాలని చెప్పింది.

జీవితంలో వీటికే నా ప్రాధాన్యం

చదువుకునే రోజుల నుంచే నటనపై అమితంగా ఇష్టం పెంచుకున్నట్లు తెలిపిన రకుల్​.. పద్దెనిమిదేళ్ల వయస్సులో మోడలింగ్​లో ప్రవేశించినట్లు వెల్లడించింది. తన తొలి ప్రాముఖ్యత ఇదేనని చెప్పుకొచ్చింది.

"చిన్నప్పటి నుంచే నటి అవ్వాలని కలలు కన్నా. పాకెట్​ మనీ కోసం కన్నడలో నా తొలి సినిమా చేశా. జీవితంలో ఈ మూడు 'ఎఫ్​'లు (ఫిల్మ్​, ఫుడ్​, ఫిట్​నెస్)​లకు ప్రాధాన్యం ఇస్తా."

-రకుల్​ ప్రీత్​ సింగ్​.

ప్రస్తుతం బాలీవుడ్​లో రొమాంటిక్​ కామెడీగా తెరకెక్కుతోన్న చిత్రంలో అర్జున్​ కపూర్​ సరసన నటిస్తోంది రకుల్. దీంతోపాటు కమల్​హాసన్​ 'భారతీయుడు 2'లోనూ కనిపించనుంది.

ఇది చూడండి : బాలీవుడ్​లో బంధుప్రీతి లేదు: జేమీ

Last Updated : Jul 9, 2020, 1:33 PM IST

ABOUT THE AUTHOR

...view details