సూపర్‌స్టార్ రజనీకాంత్.. అడవుల్లో సాహసాలు చేసేందుకు సిద్ధమయ్యాడు. అందులో భాగంగానే ప్రస్తుతం కర్ణాటకలోని బండిపురా టైగర్ రిజర్వ్ ఫారెస్టుకు చేరుకున్నాడు. డిస్కవరీ ఛానెల్ ప్రసారమయ్యే 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమం కోసం బేర్ గ్రిల్స్‌తో కలిసి పనిచేయనున్నాడు తలైవా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కొన్ని నెలల క్రితం ఈ కార్యక్రమంలో భాగమయ్యారు.
మోదీ తర్వాత అడవుల్లో సాహస యాత్రకు రజనీ - rajnikanth in bandipur
ప్రధాని నరేంద్ర మోదీ.. కొన్ని నెలల క్రితం పాల్గొన్న 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో, ఇప్పడు భాగం కానున్నాడు సూపర్‌స్టార్ రజనీకాంత్. బేర్ గ్రిల్స్‌తో కలిసి కర్ణాటకలోని అడవుల్లో సాహసాలు చేయనున్నాడు.
సూపర్‌స్టార్ రజనీకాంత్-బేర్ గ్రిల్స్
ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణ కోసం రెండురోజులు పాటు రజనీ అక్కడే ఉండనున్నాడని సమాచారం. ఇందులో భాగంగా అడవులు, నదులు, కొండల్లో తిరుగుతూ బేర్ గ్రిల్స్‌తో కలిసి సాహసాలు చేయనున్నాడు. ఎలాంటి సదుపాయాలు, ఆహారం లేకపోయినా అడవుల్లాంటి ప్రదేశాల్లో ఎలా బతకొచ్చో చూపిస్తుంటాడు బేర్. ప్రకృతిలో ఎదురయ్యే సమస్యల్ని ఎలా ఎదురించాలో వివరిస్తాడు. అందుకే ఈ షోకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది.
Last Updated : Feb 28, 2020, 6:44 AM IST