సూపర్‌స్టార్ రజనీకాంత్.. రాజకీయ రంగప్రవేశం ఎప్పుడా అని ఎదురుచూశారు తమిళులు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, కొత్త పార్టీ పెడతానని చెప్పాడీ హీరో. అప్పటి నుంచి 'తలైవా' ఇక సినిమాల్లో నటిస్తాడా అన్న సందేహం ప్రేక్షకుల్ని కలవరపెట్టింది. అయితే వారి అంచనాలకు అందకుండా వరుస చిత్రాలు చేస్తున్నాడు. 'పేట' సంక్రాంతికి రాగా, దీపావళికి రానుంది 'దర్బార్'. ఇప్పుడు మరో కొత్త సినిమాకు పచ్చజెండా ఊపాడీ హీరో.
మాస్ దర్శకుడితో రజనీకాంత్ తర్వాతి సినిమా - rajinikanth new movie
స్టార్ హీరో రజనీకాంత్.. తన తదుపరి చిత్రం శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.
సూపర్‌స్టార్ రజనీకాంత్
కోలీవుడ్‌లో మాస్ దర్శకుడిగా పేరున్న శివ తెరకెక్కించే తర్వాతి చిత్రంలో నటించనున్నాడు రజనీ. నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
ఇది చదవండి: ఇండస్ట్రీలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు 44 ఏళ్లు.. అప్పటికీ ఇప్పటికీ స్టైల్ అదే