తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ట్రాన్స్​జెండర్​ పాత్ర చేయాలనుకుంటున్న రజనీకాంత్ - kollywood news

'దర్బార్' ట్రైలర్​ లాంచ్ ఈవెంట్​లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సూపర్​స్టార్ రజనీకాంత్. రిపోర్టర్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ట్రాన్స్​జెండర్​ పాత్ర చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు.

ట్రాన్స్​జెండర్​ పాత్ర చేయాలనుకుంటున్న రజనీకాంత్
సూపర్​స్టార్ రజనీకాంత్.

By

Published : Dec 16, 2019, 11:15 PM IST

సూపర్​స్టార్ రజనీకాంత్.. తన స్టైల్​, నటన, డ్యాన్స్​లు, డైలాగ్​ డెలివరీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎందరో అభిమానుల ఆరాధ్య హీరోగా మారాడు. 'దర్బార్'​లో పోలీస్ అధికారిగా అలరించబోతున్నాడు. సోమవారం ట్రైలర్​ లాంచ్​ కార్యక్రమం జరిగింది. అందులో మాట్లాడుతూ తన మనసులో మాటను బయటపెట్టాడు.

రజనీకాంత్.. ఇంకా మీరు ఏదైనా కొత్త రోల్​, జానర్​లో నటించాలని అనుకుంటున్నారా? అని ఓ రిపోర్టర్​ అడగ్గా.. "ఇప్పటికే నేను అన్ని జానర్లలో నటించా. 45 సంవత్సరాల్లో 160 సినిమాలు చేశా. కాబట్టి దాదాపుగా అన్నింటినీ కవర్​ చేశా. అయితే ట్రాన్స్​జెండర్​ పాత్రలో నాకు నటించాలని ఉంది" అని సూపర్​స్టార్ సమాధానమిచ్చాడు.

'దర్బార్' సినిమాలో సూపర్​స్టార్ రజనీకాంత్

హీరోలు.. ట్రాన్స్​ జెండర్​గా కనిపించడం కొత్తేమి కాదు. ఈ ఏడాది తమిళంలో వచ్చిన 'సూపర్​ డీలక్స్' సినిమాలో విజయ్ సేతుపతి ఇలాంటి పాత్రనే పోషించాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. 'లక్ష్మీ బాంబ్' ట్రాన్స్​ జెండర్ రోల్​లోనే కనిపించనున్నాడు.

'దర్బార్​'లో ఆదిత్య అరుణాచలం అనే పాత్రలో నటించాడు రజనీకాంత్. నయనతార హీరోయిన్. నివేదా థామస్ అతడి కూతురిగా కనిపించనుంది. సునీల్ శెట్టి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: అప్పుడు..ఇప్పుడు.. ఎప్పటికీ 'సూపర్​స్టార్' ఒక్కడే

ABOUT THE AUTHOR

...view details