నక్షత్రం ఆధారంగా సోమవారం ప్రఖ్యాత సినీనటుడు రజనీకాంత్.. చెన్నైలోని తన నివాసంలో పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా తనను కలిసిన కేరళకు చెందిన అభిమాని, ప్రత్యేక ప్రతిభావంతుడైన ప్రణవ్‌కు పాదచాలనం చేశాడు సూపర్‌స్టార్. ఈ సందర్భంగా తన కాలితో గీసిన చిత్రపటాన్ని ఆయనకు అందజేశాడు ప్రణవ్. డిసెంబర్ 12న రజనీ జన్మదిన వేడుకల కోసం అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రత్యేక ప్రతిభావంతుడికి రజనీ పాదచాలనం - రజనీకాంత్
కేరళకు చెందిన అభిమాని, ప్రత్యేక ప్రతిభావంతుడు ప్రణవ్.. సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ఆయన స్వగృహంలో కలిశాడు. తన కాళ్లతో గీసిన చిత్రపటాన్ని తలైవాకు అందజేశాడు.
రజనీ
కేరళలోని పలక్కడ్ జిల్లా అలత్తూర్కు చెందిన ప్రణవ్.. ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కలిసి సెల్ఫీ తీసుకున్నాడు. విపత్తు సహాయనిధికి కొంత మొత్తాన్ని అందజేశాడు.
ఇవీ చూడండి.. 'నేనూ.. అంజలా జవేరి ఇరవయ్యేళ్లుగా ప్రేమలో ఉన్నాం'
Last Updated : Dec 3, 2019, 9:58 AM IST