సూపర్‌స్టార్ రజనీకాంత్ గతేడాది అనారోగ్యానికి గురవ్వడం వల్ల 'అన్నాత్తె' చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆ సినిమా షూటింగ్ గురించి కొన్ని వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. షూటింగ్ సందర్భంగా గత డిసెంబర్‌లో రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా.. ఆయనకు రక్తపోటులో హెచ్చుతగ్గులు వచ్చాయని తేలింది. ఈక్రమంలో ఆయనకు చికిత్స చేసిన వైద్యులు రజనీకాంత్‌కు కొన్ని నెలల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు.
అనారోగ్యం నుంచి ఇటీవలే కోలుకోగా.. ప్రస్తుతం ఆయన చెన్నైలో జరుగుతోన్న 'అన్నాత్తె' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆయనతో పాటే వైద్యులు కూడా సినిమా సెట్లోనే అందుబాటులో ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. దీనికి సంబంధించి చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.