తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అన్నాత్తే' షూటింగ్​ పూర్తిచేసిన రజనీకాంత్! - ramoji film city

కొత్త సినిమాలో తన పాత్ర షూటింగ్​ను తలైవా రజనీకాంత్ పూర్తి చేశారట. చెన్నైలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ చెప్పనున్నట్లు తెలుస్తోంది.

Rajinikanth 'Annatha' shooting over in hyderabad
రజనీకాంత్

By

Published : May 11, 2021, 5:30 AM IST

గత కొద్దిరోజుల నుంచి 'అన్నాత్తే' షూటింగ్​తో సూపర్​స్టార్ రజనీకాంత్ బిజీగా ఉన్నారు. హైదరాబాద్​లోని రామోజీఫిల్మ్​సిటీలో చిత్రీకరణ సాగుతోంది. అయితే రజనీకి సంబంధించిన సన్నివేశాలన్నీ పూర్తయ్యాయని, సోమవారం ఆయన చెన్నైకి తిరుగు ప్రయాణం కానున్నట్లు తెలుస్తోంది.

తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్​ను రజనీకాంత్, చెన్నై త్వరలో పూర్తి చేస్తారట. అన్ని అనుకున్నట్లు జరిగితే చెప్పిన తేదీ ప్రకారం ఈ ఏడాది దీపావళికి సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లే!

ఈ సినిమాలో రజనీతో పాటు నయనతార, మీనా, ఖుష్బూ, కీర్తి సురేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్నారు. సన్​పిక్చర్స్ భారీ వ్యయంతో నిర్మిస్తోంది.​

ABOUT THE AUTHOR

...view details