కరోనాతో సుదీర్ఘకాలం పాటు నిలిచిపోయిన సినిమా షూటింగులు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ శనివారం చిత్రీకరణలో పాల్గొన్నారు. ఆరునెలల విరామం తర్వాత సినిమా షూటింగ్లో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. చిత్రీకరణ పూర్తిగా జైపూర్ ప్యాలెస్లో జరగుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. కరోనా సమయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అందరినీ అలరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
'మళ్లీ షూటింగ్లో పాల్గొనడం సంతోషంగా ఉంది' - లాక్డౌన్ రాజేంద్ర ప్రసాద్
ఆరునెలల లాక్డౌన్ విరామం తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొన్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్.. ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ.. కరోనా సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
రాజేంద్ర ప్రసాద్
విజయ్ సేతుపతి, తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నారు. ఇందులో నటి రాధిక భర్తగా కనిపించనున్నారు.