తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ నటుడి వైద్యానికి రజని, కమల్‌ సాయం!

తమిళ్‌, తెలుగు చిత్రాల్లో విలన్‌గా నటించిన పొన్నాంబళన్‌ చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఈ నటుడుకి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ సహాయం చేశారని కోలీవుడ్​లో చర్చించుకుంటున్నారు .

rajanikanth, kamal helped the actor
రజని, కమల్‌ సాయం!

By

Published : Jul 11, 2020, 10:03 PM IST

అనారోగ్యంతో బాధపడుతున్న తమిళ నటుడు పొన్నాంబళన్‌కు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ సహాయం చేశారని టాక్​. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తమిళ్‌, తెలుగు చిత్రాల్లో విలన్‌గా నటించిన పొన్నాంబళన్‌ చాలా రోజులుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉండటం వల్ల రెండు నెలలుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌ నటులు ఆయనకు సహాయం చేస్తున్నారు. అందులో భాగంగానే కమల్​, రజనీ సాయం చేశారని తెలిసింది.

పొన్నాంబళన్ పిల్లల చదువుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని కమల్‌ హాసన్‌ ముందుకొచ్చారని సమాచారం. వైద్యానికి అయ్యే ఖర్చును తాను భరిస్తానని హామీ ఇచ్చారు రజనీ.

ఇది చూడండి : అద్భుత ప్రపంచం 'డిస్నీ వరల్డ్'​ పునఃప్రారంభం.. కానీ

ABOUT THE AUTHOR

...view details