తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరోసారి రాజ్​తరుణ్​ సరసన 'కుమారి' - rajtharun latest news

'ఉయ్యాల జంపాల' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన హీరో రాజ్​తరుణ్​ తాజాగా కొండా విజయ్​ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. కుమారి 21ఎఫ్ కథానాయిక హెబ్బా పటేల్​ ఈ చిత్రంతో మరోసారి రాజ్​తరుణ్​తో జోడీ కడుతోంది.

బుజ్జిగాడి సరసన మరోసారి కుమారి

By

Published : Nov 16, 2019, 7:11 AM IST

సినీ కెరీర్‌ ఆరంభంలో హ్యట్రిక్‌ విజయాలతో గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు రాజ్‌ తరుణ్‌. ఏడాదికి రెండు, మూడు చిత్రాలతో పలకరించే ఈ యువ నటుడు ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో ‘ఓరేయ్‌ బుజ్జిగా' సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో హెబ్బా పటేల్‌ మరోసారి రాజ్‌తరుణ్‌తో జోడీ కడుతోంది.

కుమారి 21ఎఫ్‌తో మొదలు వీరిద్దరి కలయికలో నాలుగు చిత్రాలొచ్చాయి. దాదాపు అన్నీ విజయవంతమయ్యాయి. ఈ సినిమా కూడా హిట్‌ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు రాజ్‌తరుణ్‌. మాళవికా నాయర్‌ మరో నాయికగా నటిస్తోంది. ఇందులో హెబ్బా పటేల్‌ పాత్ర చిత్రానికే ప్రధాన ఆకర్షణ అని సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోను విడుదల చేసింది చిత్ర బృందం.

బుజ్జిగాడి సరసన మరోసారి కుమారి

ఇదీ చూడండి:'రెండు అరటిపండ్లు'-తాజా వ్యాపార ప్రచారాస్త్రం

ABOUT THE AUTHOR

...view details