తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ సినిమా కోసమే నాగశౌర్య ఇంటికి దర్శకేంద్రుడు! - naga shourya

ప్రమాదంలో గాయపడ్డ టాలీవుడ్ యువహీరో నాగశౌర్యను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పరామర్శించారు.

నాగశౌర్యను పరామర్శించిన దర్శకేంద్రుడు

By

Published : Jun 19, 2019, 4:47 PM IST

టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య ఇటీవల ఓ మూవీ చిత్రీకరణలో గాయపడ్డ సంగతి తెలిసిందే. అతడికి నెల రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.

ఈ విష‌యం తెలుసుకున్న ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ఈరోజు నాగ‌శౌర్య నివాసానికి వెళ్లి ప‌రామ‌ర్శించారు. మరో ద‌ర్శ‌కుడు బి.వి.య‌స్ ర‌వి ఆయనతో యువహీరో ఇంటికి వెళ్లారు.

నాగశౌర్యతో రాఘవేంద్రరావు, బీవీఎస్ రవి

దర్శకుడు రాఘవేంద్రరావు నాగశౌర్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారట. అలాగే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారట. ప్రస్తుతం దర్శకేంద్రుడు ముగ్గురు హీరోయిన్స్ , ముగ్గురు దర్శకులతో నిర్మించనున్న ప్రయోగాత్మక మూవీలో హీరోగా నాగశౌర్యను తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

నాగశౌర్యతో రాఘవేంద్రరావు

ఇవీ చూడండి.. 'సాహో'లో నా పాత్ర ఎలా ఉంటుందంటే?

ABOUT THE AUTHOR

...view details