శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ల నుంచి తాను తృటిలో తప్పించుకున్నానని సినీ నటి రాధికా శరత్‌కుమార్ తెలిపింది. కొలంబొలోని సినమన్ గ్రాండ్ హోటల్ బాంబు దాడి జరగడానికి కొంచెం ముందే తాను అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు చెప్పింది.
"శ్రీలంకలో జరిగిన ఘటన షాక్‌కు గురిచేసింది. కొలంబొలోని సినమన్ గ్రాండ్ హోటల్లో బాంబు దాడి జరగడానికి కొంచెం ముందే నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఈ పిరికి పంద చర్యను ఖండిస్తున్నాను. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను" -రాధికా శరత్‌కుమార్, సినీ నటి.