అల్లు అర్జున్ 'పుష్ప'(Pushpa Release Date) సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna Upcoming Movie) ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేశారు. శ్రీవల్లి పాత్రలో ఆమె నటిస్తున్నట్లు వెల్లడించారు. పల్లెటూరి యువతిగా మాస్ లుక్‌లో రష్మిక ఆకట్టుకుంటోంది. చెవులకు దిద్దులు పెట్టుకుంటూ కనిపించింది.
బన్నీ(Allu Arjun Movies) కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. కన్నడ నటుడు ధనుంజయ, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.