Pushpa making video: అల్లు అర్జున్ 'పుష్ప'.. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తొలి వారం పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.229 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరిన్ని వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే 'పుష్ప' మేకింగ్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఈ వీడియోలోని ప్రతి ఫ్రేమ్ ఆకట్టుకుంటుంది.
శేషాచలం ఎర్రచందనం నేపథ్యంగా తీసిన 'పుష్ప' సినిమాలో అల్లుఅర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీమూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
Akhanda movie: నందమూరి బాలకృష్ణ 'అఖండ'.. థియేటర్లలో 25 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు పలువురు డిస్ట్రిబ్యూటర్స్ హాజరయ్యారు.
మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య డబుల్ రోల్లో కనిపించారు. అఘోరాగా విశ్వరూపం చూపించి, అభిమానుల్ని ఆశ్చర్యపరిచారు. తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికే హైలెట్‌గా నిలిచింది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత.