పూరీ జగన్నాథ్‌కు అర్జెంట్‌గా ఓ హిట్ కావాలి. 'టెంపర్' సినిమా తర్వాత అతడు తెరకెక్కించిన చిత్రాలను ప్రేక్షకులు ఆదరించలేదు. ఇప్పుడు 'ఇస్మార్ట్ శంకర్'తో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. గురువారం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కథను ఓ ఆంగ్ల చిత్రాన్ని కాపీ చేసి తీశారని పూరీపై విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించాడీ దర్శకుడు.
"అవును, నేను 'ఇస్మార్ట్ శంకర్'ను కొన్ని హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో రూపొందించాను. కానీ వేటినీ నేను కాపీ చేయలేదు. థియేటర్లలో చిత్రం చూస్తే మీకు ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది" -పూరీ జగన్నాథ్, దర్శకుడు