మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న లేడీ సూపర్‌స్టార్ నయనతార. తాజాగా ఆమె గురించి ప్రముఖ నిర్మాత కె.రాజన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సినిమా కోసం కాకుండా నిర్మాత అదనంగా చాలా డబ్బులు ఖర్చు చేస్తుంటారని ఆయన పేర్కొన్నాడు. నయనతార అసిస్టెంట్స్ జీతాలు భరించాల్సి వస్తుందని ఆయన చెప్పుకొచ్చాడు.
" ఆరు లేదా ఏడుగురు వ్యక్తులు నయనతారకు సహాయకులుగా పనిచేస్తుంటారు. వారందరూ రోజూ నయనతారతోనే సెట్‌లో ఉంటారు. ఆ అసిస్టెంట్స్ ఒక్కొక్కరికీ రోజువారీ జీతం రూ.7 వేల నుంచి రూ.12 వేల వరకు ఉంటుంది. ఈ నటి అసిస్టెంట్స్ జీతాల గురించి చాలామంది చెప్పుకోవడం విన్నాను. అది నిజమే. ఆ సహాయకులందరి రోజు వారీ ఇచ్చే జీతం మొత్తం దాదపు 80వేలు ఉంటుంది. వీటితో పాటు కారు డ్రైవర్, డీజిల్ ఖర్చులు కూడా నిర్మాతే చెల్లించాల్సి ఉంటుంది"
-- కె.రాజన్, నిర్మాత