మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. ఆయన నటించిన 'వకీల్‌సాబ్' ఈరోజు విడుదలైంది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు ఇప్పటికే పూర్తయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమాను వీక్షించిన నిర్మాత దిల్‌రాజు థియేటర్లో ఓ ఫ్యాన్‌గా సందడి చేశారు.
'వకీల్‌సాబ్' చూస్తూ థియేటర్లో దిల్‌రాజు హంగామా - దిల్‌రాజు వకీల్‌సాబ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'వకీల్‌సాబ్' నేడు థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ సినిమా ప్రీమియర్ షో వీక్షించిన నిర్మాత దిల్‌రాజు థియేటర్లో పేపర్లు విసురుతూ పవన్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు.
దిల్‌రాజు
శివపార్వతి థియేటర్లో కుటుంబంతో సహా ప్రీమియర్ షో వీక్షించిన దిల్‌రాజు.. పవన్‌పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. థియేటర్లో కాగితాలు విసురుతూ సందడి చేశారు. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.
హిందీ 'పింక్'కు రీమేక్‌గా తెరకెక్కింది 'వకీల్‌సాబ్'. వేణు శ్రీరామ్ దర్శకుడు. శ్రుతి హాసన్, అంజలి, నివేదా థామస్, అనన్యా నాగళ్ల, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు.