తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రియాంకకు నిక్ క్రిస్మస్ బహుమతి - శాంటా క్లాజ్​

ప్రముఖ పాప్​ సింగర్​ నిక్​ జోనస్​ తన భార్య ప్రియాంకా చోప్రాకు క్రిస్మస్​​ సందర్భంగా ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చాడు. ఈ గిఫ్ట్​ను చూసి ఆమె తెగ మురిసిపోతూ తన ఆనందాన్ని ఇన్​స్టా ద్వారా అభిమానులతో పంచుకుంది.

Priyanka gets 'batmobile' as Xmas gift from hubby Nick
నిక్​ జోనస్..​ తన శ్రీమతికి ఏ బహుమతి ఇచ్చాడో తెలుసా..?

By

Published : Dec 26, 2019, 6:44 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ ప్రియాంక చోప్రా మంచుపై సవారి చేస్తోంది. ఎందుకంటారా..! క్రిస్మస్ సందర్భంగా స్నో మొబైల్​ వాహనాన్ని భర్త నిక్​ జోనస్​ ఆమెకు బహుకరించాడు. ఈ విషయాన్ని ఇన్​స్టాగ్రామ్​ ద్వారా అభిమానులతో పంచుకుంది ప్రియాంక.

"నాకు ఏం కావాలో నా భర్తకు బాగా తెలుసు. క్రిస్మస్ రోజు ఈ బహుమతి ఇచ్చినందుకు థ్యాంక్స్​. శాంటా క్లాజ్​ ఇప్పుడు నా వాహనంపై విహరిస్తాడు."
-ప్రియాంకా చోప్రా

ప్రియాంక పోస్ట్​పై నిక్ స్పందించాడు. ఈ వాహనంపై వీరిద్దరూ దిగిన ఫొటోను జతచేసి "నా భార్య సంతోషం కన్నా నాకేది ఎక్కువ కాదు" అని ఇన్​స్టాలో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు నిక్​.

ఇదీ చదవండి:- 'ముక్కాలా ముక్కాబులా' ఎలా వచ్చిందో తెలుసా..!

ABOUT THE AUTHOR

...view details