తెలంగాణ

telangana

ETV Bharat / sitara

భర్తను ఆటాడుకున్న ప్రియాంక.. విడాకుల రూమర్లకు చెక్!

భర్త నిక్ జోనస్​తో నటి ప్రియాంక చోప్రా (Priyanka and Nick Latest News) విడాకులు తీసుకోబోతోందన్న రూమర్లు ఇటీవల చక్కర్లు కొట్టాయి. వాటికి తనదైన శైలిలో చెక్​ పెట్టింది ప్రియాంక. భర్తను ఆటపట్టిస్తూ అతడిపై ఎంత ప్రేమ ఉందో తెలియజేసింది.

priyanka chopra husband
ప్రియాంక చోప్రా

By

Published : Nov 24, 2021, 1:19 PM IST

భర్త నిక్ జోనస్​తో విడాకులు తీసుకోబోతుందంటూ వస్తున్న రూమర్లకు చెక్ పెట్టింది బాలీవుడ్‌ నటి, గ్లోబుల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా (Priyanka and Nick Latest News). ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జరిగిన 'జొనాస్‌ బ్రదర్స్ ఫ్యామిలీ రోస్ట్‌' అనే షోలో నిక్​ను, అతడి సోదరులను ఘోరంగా ఆటపట్టించింది. ఈ షోలో జోనస్ బ్రదర్స్​ సతీమణులు కూడా పాల్గొన్నారు.

ప్రియాంక, నిక్ జోనస్

ప్రముఖ కమెడియన్‌ కెనన్ థాంప్సన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షోలో ప్రియాంక చోప్రా.. నిక్‌ని (Priyanka and Nick Latest News) ఓ ఆట ఆడుకున్నారు. సరదా పంచులు వేస్తూ అందర్నీ నవ్వించారు. అనంతరం నిక్‌ అంటే తనకెంత ఇష్టమో బయటపెట్టారు.

భర్తతో ప్రియాంక

"ఈ షోలో పాల్గొని నా భర్త నిక్‌ జొనాస్‌తోపాటు ఆయన సోదరులను రోస్ట్‌ చేయడం నాకెంతో థ్రిల్లింగ్‌గా ఉంది. సంస్కృతి, ఎంటర్‌టైన్‌మెంట్‌, సంగీతానికి గొప్పస్థానం ఉన్న ఇండియా నుంచి నేను వచ్చాను. నిక్‌-నాకు మధ్య పదేళ్ల వ్యత్యాసం ఉంది. మేమిద్దరం ఎన్నో విశేషాలపై చర్చించుకుంటాం. ఒకరి నుంచి మరొకరం ఎన్నో నేర్చుకుంటాం. టిక్‌టాక్‌ ఎలా వాడాలో తనే నాకు నేర్పించాడు. సక్సెస్‌ఫుల్‌ యాక్టింగ్‌ కెరీర్‌ ఎలా ఉంటుందో నేను తనకి చూపించాను. జొనాస్‌ బ్రదర్స్ ఎప్పుడూ ఫోన్లతోనే బిజీగా ఉంటారు. సోషల్‌మీడియా వేదికగా తరచూ ఏదో ఒక కంటెంట్‌ షేర్‌ చేస్తుంటారు. కానీ, వాళ్ల ముగ్గురికీ ఉన్న ఫాలోవర్స్‌ కంటే కూడా నా ఒక్కదానికే ఇన్‌స్టాలో ఉన్న ఫాలోవర్స్ ఎక్కువ. నిక్‌పై నాకెంతో ప్రేమ ఉంది. అతను నా జీవితాన్ని ఎంతో మార్చేశాడు. నిజం చెప్పాలంటే ఇప్పటికీ మా ఇద్దరికీ పిల్లలు లేరు. కానీ ఈ రోజు మీ అందరి ముందు ఓ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మేమిద్దరం.." అని ప్రియాంక చెప్పగానే నిక్‌ ఓ నిమిషం షాకై అలానే చూస్తుండిపోయారు.

అనంతరం ప్రియాంక.. "మేమిద్దరం ఈ రోజు రాత్రి డ్రింక్‌ చేసి.. రేపు ఉదయం ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకుంటున్నాం" అని సరదాగా నవ్వులు పూయించింది. నిక్‌-ప్రియాంక విడాకులు (Priyanka Chopra Divorce) తీసుకోనున్నారంటూ సోమవారం జోరుగా ప్రచారం జరిగింది. అందుకే ఆమె ఇన్‌స్టా నుంచి జొనాస్‌ పేరు తొలగించిందని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం నిక్‌ ఓ వర్కౌట్‌ వీడియో షేర్‌ చేయగా.. 'మీ కండలపై మనసు పారేసుకున్నాను' అంటూ లవ్‌ సింబల్‌ ఎమోజీతో ఓ కామెంట్‌ పెట్టారు. దీంతో వీరిద్దరి విడాకుల వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడింది.

ప్రియాంక చోప్రా

ABOUT THE AUTHOR

...view details