తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రియాంక చోప్రాకు ఐరాస మద్దతు- పాక్​కు షాక్ - ఐరాస

ప్రియాంక చోప్రాను యూనిసెఫ్ సౌహార్ధ రాయబారి​గా తొలగించాలని ఇటీవల పాక్ మంత్రి ఐరాసకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ బాలీవుడ్​ నటికి మద్దతుగా మాట్లాడారు. ఆమె వ్యాఖ్యలు వ్యక్తిగతమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రియాంక

By

Published : Aug 23, 2019, 5:42 PM IST

Updated : Sep 28, 2019, 12:30 AM IST

భారత సైన్యానికి మద్దతుగా, దేశంపై అభిమానం వ్యక్తం చేస్తూ ప్రియాంకా చోప్రా ట్వీట్​ చేయడం ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది. యునిసెఫ్ గుడ్​విల్​ అంబాసిడర్​గా ఉన్న ఆమె... శాంతి స్థాపనకు బదులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిందని ఐరాసలో పాక్​ ఫిర్యాదు చేసింది. వెంటనే సౌహార్ధ రాయబారి బాధ్యతల నుంచి తొలగించాలని కోరింది.

ఈ అంశంపై బాలీవుడ్ ప్రముఖులు ప్రియాంకకు తోడుగా నిలిచారు. తాజాగా వీరితో పాటు ఐకరాజ్యసమితి కూడా బాలీవుడ్ ​భామకు మద్దతిచ్చింది. అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయలని ఐరాస సెక్రటరీ జనరల్​ ఆంటోనియో గుటెరస్ తెలిపారు.

"వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలు యూనిసెఫ్​ను ప్రభావితం చేయవు. యూనిసెఫ్ తరపున అలాంటి వ్యాఖ్యలు చేస్తే వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. గుడ్​విల్ అంబాసిడర్లు వారి సమయాన్ని బాలల హక్కుల సంరక్షణ కోసం కేటాయించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చినవారు. వారికి వ్యక్తిగతంగా అభిప్రాయం వ్యక్తం చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది".
-ఆంటోనియో గుటెరస్, ఐరాస సెక్రటరీ జనరల్​

పుల్వామా ఘటన అనంతరం బాలాకోట్​పై భారత సైనికుల మెరుపుదాడులను కొనియాడుతూ.. ట్వీట్ చేసింది ప్రియాంక. "జైహింద్, ఇండియన్ ఆర్మ్​డ్​ ఫోర్సెస్" అని పోస్ట్ చేసింది. ఈ అంశంపై కొంతమంది నెటిజన్లు ప్రియాంకను విమర్శించారు.

ఇటీవలే కశ్మీర్​కు ప్రత్యేకహోదా కల్పించే ఆర్టికల్ 370ను భారత ప్రభుత్వం రద్దుచేసింది. దీనికి మద్దతుగా మాట్లాడింది ప్రియాంక. గుడ్​విల్ అంబాసిడర్​గా ఉండి ఒక దేశం పట్ల పక్షపాతంగా ఉండటం సరికాదంటూ పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇది చదవండి: 'మొక్కలు నాటి... అమెజాన్​ అడవులకు ఊపిరిపోద్దాం'

Last Updated : Sep 28, 2019, 12:30 AM IST

ABOUT THE AUTHOR

...view details