'ఎవరే అతగాడు' చిత్రంతో తెలుగు తెరపైకి వచ్చిన ప్రియమణి అంటే పెద్దగా తెలియదు. కానీ 'పెళ్లయిన కొత్తలో' చిత్రంలో జగపతిబాబు సరసన నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం వెంకటేష్ సరసన కథానాయికగా నటించనుందని సమాచారం.
తమిళంలో ధనుష్ నటించిన 'అసురన్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ధనుష్ పాత్రని వెంకటేష్, మంజు వారియర్ పోషించిన పచ్చయమ్మాల్ పాత్రని ప్రియమణి చేయనుందని వార్తలొస్తున్నాయి. ప్రియమణి కూడా తన అంగీకారాన్ని తెలియజేసిందని సమాచారం. అయితే ఇంకా అధికారికంగా సమాచారం బయటకు రాలేదు.