తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కాపీ పేస్ట్​'తో ప్రియా వారియర్ ట్రెండింగ్​ - ఒరు అదార్​ లవ్​

కనుసైగతో ఎంతో మందిని మాయ చేసి...రాత్రికి రాత్రి స్టార్​గా ఎదిగింది ప్రియా వారియర్. ఇప్పుడు​ మళ్లీ నెట్టింట సంచలనంగా మారింది. ఆమె పెట్టిన ఓ ఫొటోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

మళ్లీ నెట్టింట ప్రియా వారియర్ ట్రెండింగ్​

By

Published : Apr 13, 2019, 9:44 AM IST

మలయాళ నటి ప్రియావారియర్​ చేసిన ఓ చిన్న తప్పు నెట్టింట వైరలవుతోంది. ఆమె ఇన్​స్టాలో చేసిన ఓ పోస్టు చర్చనీయాంశమయింది. ​ఓ ప్రైవేటు ప్రకటన కోసం తను ఫొటోను అభిమానులకు షేర్​ చేసింది ఈ 19 ఏళ్ల భామ. అయితే ఆ చిత్ర క్యాప్షన్​లో 'ఇది ఇన్​స్టా, ఫేస్​బుక్​ కోసం ' అంటూ సంస్థ పంపిన పోస్టును అలాగే సామాజిక మాధ్యమంలో పంచుకుంది ప్రియా. నెటిజన్లు ఈ క్యాప్షన్​పై విశేషంగా స్పందిస్తున్నారు.

  • విపరీతమైన కామెంట్లు వచ్చిన తర్వాత తప్పు సరిదిద్దుకున్నా ప్రయోజనం లేకపోయింది. నెటిజన్లు మాత్రం కాపీపేస్టు అంటూ చలోక్తులు విసురుతున్నారు. ఆమెను అన్ ​ఫాలో చేసేయండి అని కొందరు, కావాలనే ఇదంతా చేసిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
    ప్రియా వారియర్​ ఇన్​స్టా పోస్టు

ఒరు అదార్​ లవ్​లో కన్నుగీటి మంచి పాపులర్​ అయింది ప్రియా వారియర్​. తర్వాత అదే సినిమాలో అదర చుంభనంతోనూ మాయ చేసింది. గత ఏడాది గూగుల్​లో ఎక్కువమంది వెతికిన సెలబ్రిటీగా పేరు తెచ్చుకుందీ మలయాళీ భామ.

ABOUT THE AUTHOR

...view details