యువ కథానాయకుడు సాయిధరమ్‌తేజ్‌తో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ప్రతిరోజూ పండగే. తాజాగా ఈ సినిమాలోని ఓ పాటకు సంబంధించి ప్రోమో వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. బావ, మరదళ్ల మధ్య సాగే పాట ఇది. ‘ఓ బావ మా అక్కను సక్కగ చూస్తావా.. ఓ బావ ఈ చుక్కని పెళ్లాడేస్తావా’ అంటూ నెట్టింట సందడి చేస్తోంది. రాశీఖన్నా ఇందులో కథానాయిక. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
'బావ'తో పండగే అంటోన్న రాశీఖన్నా..! - తెలుగు తాజా సినిమా వార్తలు
యంగ్ హీరో సాయిధరమ్‌తేజ్ హీరోగా నటిస్తున్న ప్రతిరోజూ పండగే సినిమాలోని ఓ పాటకు సంబంధించి ప్రోమోను విడుదల చేశారు. బావా మరదళ్ల మధ్య సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. పూర్తి పాట నవంబరు 18న విడుదల కానుంది.
సందడి చేస్తున్న 'ఓ బావా'
పాటను అందమైన లొకేషన్లలో చిత్రీకరించడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నాడు. పూర్తి పాట నవంబరు 18న విడుదల కానుంది.