మెగాహీరో సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం 'ప్రతిరోజు పండగే'. మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
చేతిలో చేయి వేసి ఉన్న ఈ ప్రీలుక్‌లో ఓ పల్లెటూరి వాతావరణాన్నిచక్కగా చూపించారు. రేపు రాత్రి ఎనిమిది గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.