పోలింగ్.. ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలల్లోనే జరుగుతుంటుంది. ఓటు ఉన్నవారు సొంత ఊరిలో చదువుకున్న స్కూల్లోనే ఓటేసే అవకాశముంటుంది. సినీ ప్రముఖులకు ఆ ఛాన్స్ తక్కువ. కానీ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు ఆ అవకాశం దక్కింది. 41 ఏళ్ల క్రితం ఆయన చదువుకున్న పాఠశాలలోనే ఇప్పుడు ఓటేశాడు.
విచిత్రమేమంటే ఆయన కూర్చున్న తరగతి గదిలోనే తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. దీనిపై ప్రకాశ్‌రాజ్ ట్విట్టర్లో స్పందించాడు. జీవితంలో ఇది సరికొత్త ప్రయాణమని తెలిపాడు.