బాక్సాఫీస్ వద్ద కక్ష సాధింపులు ఎందుకు..? ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రకాశ్‌రాజ్ ట్వీట్ - ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రకాశ్‌రాజ్ ట్వీట్
13:54 February 27
ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రకాశ్‌రాజ్ ట్వీట్
prakash raj tweet on ap govt: సినీ రంగంపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నటుడు ప్రకాశ్‌రాజ్ ఘాటుగా స్పందించారు. సృజన.. సాంకేతికత మేళవించిన రంగం సినిమా అన్నారు. సినీరంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏంటి? అని ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా? అని నిలదీశారు. ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి.. కానీ కక్ష సాధింపులు బాక్సాఫీస్ వద్ద ఎందుకు..? అని ట్వీట్ చేశారు. ఎంత ఇబ్బందిపెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు అడ్డుకట్ట వేయలేరని హితవు పలికారు.
ఇదీ చదవండి: