తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ప్రాజెక్ట్​ కే' తొలి షెడ్యూల్​ పూర్తి.. 'హనుమాన్'​ సర్​ప్రైజ్ - ప్రభాస్​ ప్రాజెక్ట్​ కే సినిమా

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో ప్రభాస్​ 'ప్రాజెక్ట్​ కే', వెంకటేశ్​ 'ఎఫ్​ 3', నాని 'శ్యామ్ ​సింగరాయ్'​, 'హనుమాన్​' చిత్రాల వివరాలు ఉన్నాయి.

ప్రాజెక్ట్​ కే తొలి షెడ్యూల్​ పూర్తి, project k schedule complete
ప్రాజెక్ట్​ కే తొలి షెడ్యూల్​ పూర్తి

By

Published : Dec 13, 2021, 12:50 PM IST

Prabhas Project K Movie: 'హైదరాబాద్​ చాలా అందంగా ఉంది. త్వరలోనే మళ్లీ వస్తాను' అంటూ తన ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ దీపికా పదుకొణె. ప్రభాస్​-నాగ్​అశ్విన్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్​ సినిమా 'ప్రాజెక్ట్​ కే'. ఈ చిత్ర షూటింగ్​ కోసం భాగ్యనగరం వచ్చిన ఈ భామ తిరిగి ముంబయి వెళ్తూ ఈ పోస్ట్​ చేసింది. ఈ సినిమా తొలి షెడ్యూల్​ పూర్తిచేసుకున్నట్లు పేర్కొంది. అంతకుముందు తనకు ప్రభాస్​, దర్శకుడు నాగ్​ అశ్విన్​ స్పెషల్​ ఫుడ్​ ట్రీట్​ ఇచ్చినట్లు వంటకాలకు సంబంధించిన ఫొటోను పోస్ట్​ చేసింది దీపిక.

ప్రాజెక్ట్​ కే తొలి షెడ్యూల్​ పూర్తి
దీపికాపదుకొణెకు ప్రభాస్​ ఫుడ్​ ట్రీట్​

F3 Venkatesh Movie: 'ఎఫ్ 2' సీక్వెల్​గా వెంకటేశ్​, వరుణ్​తేజ్​ ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం 'ఎఫ్​ 3'. సునీల్​ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. నేడు వెంకీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ వెంకీకి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను పోస్ట్​ చేసింది చిత్రబృందం. ఈ మూవీలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్​రాజు నిర్మాత.

Nani Shyamsingharoy movie: నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా 'శ్యామ్ ​సింగరాయ్'. డిసెంబరు 24న థియేటర్లలోకి రానుందీ చిత్రం. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్​ను డిసెంబరు 14న రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఇందులో సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు.

శ్యామ్​ సింగరాయ్​ ట్రైలర్​ రేపు విడుదల

Prasanth varma new film: 'అ!, క‌ల్కి, జాంబిరెడ్డి చిత్రాల‌తో వైవిధ్య క‌థ‌ల ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న ప్ర‌శాంత్ వ‌ర్మ‌ 'హ‌నుమాన్' అనే వినూత్న క‌థ‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. తెలుగులో తెర‌కెక్కుతోన్న తొలి ఒరిజిన‌ల్ సూప‌ర్ హీరో చిత్రం ఇది. తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న నటి అమృతను మీనాక్షిగా పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.

ఇదీ చూడండి: మరో పాన్​ ఇండియా ప్రాజెక్టులో ప్రభాస్​.. ప్రకటన అప్పుడే!

ABOUT THE AUTHOR

...view details