తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'స్పిరిట్'​ కన్నా ముందే ప్రభాస్​ 'రాజా డీలక్స్'​​!

Prabhas Maruti movie: సందీప్​ వంగా దర్శకత్వంలో ప్రభాస్​ నటించనున్న 'స్పిరిట్'​ చిత్రం కన్నా మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోయే 'రాజా డీలక్స్'​ను సెట్స్​పైకి తీసుకెళ్లాలని చిత్రబృందం ప్లాన్​ చేస్తోందట! ఈ నేపథ్యంలో 'రాజాడీలక్స్'​ కోసం అత్యంత భారీ స్థాయిలో సెట్​ను నిర్మిస్తున్నట్లు తెలిసింది. కాగా, ఓ జపనీస్​ సినిమా కథ స్ఫూర్తితోనే 'ఆదిపురుష్'​ను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు ఓంరౌత్​ తెలిపారు.

prabhas
ప్రభాస్​

By

Published : Feb 23, 2022, 11:49 AM IST

Updated : Feb 23, 2022, 12:59 PM IST

Prabhas Maruti movie: దర్శకుడు మారుతి-ప్రభాస్​ కాంబోలో 'రాజా డీలక్స్​' అనే సినిమా తెరకెక్కనుందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడీ మూవీ గురించి మరో వార్త బయటకు వచ్చింది. షూటింగ్​ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. సందీప్​ వంగా దర్శకత్వంలో డార్లింగ్​ నటించనున్న 'స్పిరిట్'​ చిత్రం కన్నా ముందే ఈ మూవీని సెట్స్​పైకి తీసుకెళ్లాలని చిత్రబృందం యోచిస్తుందని తెలిసింది. ఇక ఈ ప్రాజెక్ట్​ కోసం అత్యంత భారీ స్థాయిలో సెట్స్​ నిర్మిస్తున్నారట! త్వరలోనే అధికారికంగా ప్రకటించి ఇతర నటీనటుల వివరాలను తెలుపనున్నారట. రెగ్యులర్​ షూటింగ్​ కూడా ప్రారంభిస్తారని సమాచారం. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. కాగా, డార్లింగ్​ నటించిన 'రాధేశ్యామ్'​ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు 'ఆదిపురుష్'​, 'సలార్', 'స్పిరిట్'​, 'ప్రాజెక్ట్​ కె' చిత్రాల్లోనూ ఆయన నటిస్తున్నారు.

ప్రభాస్​

ఆ కథ స్ఫూర్తితోనే

Prabhas Adipurush movie: ప్రభాస్​ నటిస్తున్న మరో పాన్​ ఇండియా చిత్రం 'ఆదిపురష్​'. భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా చిత్రకరణ పూర్తి చేసుకుంది. ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు దర్శకుడు ఓంరౌత్​. "ఈ సినిమా ఆలోచన ఓ జపనీస్​ కథ నుంచి పుట్టింది. ఏ ప్రిన్స్​ ఆఫ్​ లైట్​ అనే సినిమా చూశా. చాలా బాగా నచ్చింది. ఆ స్ఫూర్తితోనే ఆదిపురుష్​కు శ్రీకారం చుట్టాం." అని రౌత్​ అన్నారు. ఇక ఈ చిత్రంలో సైఫ్​ అలీఖాన్​, కృతిసనన్​ కీలక పాత్రలు పోషించారు.

ఆదిపురుష్​

ఇదీ చూడండి: 'కళావతి' సాంగ్​కు తమన్.. 'శ్రీవల్లి' పాటకు బాబు మోహన్​​ స్టెప్పులు!

Last Updated : Feb 23, 2022, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details