తెలంగాణ

telangana

ETV Bharat / sitara

20 వేల స్క్రీన్స్​లో ప్రభాస్ 'ఆదిపురుష్' రిలీజ్! - prabhas movies news

Adipurush movie: రామాయణంగా ఆధారంగా తెరకెక్కుతున్న 'ఆదిపురుష్' సినిమాను భారీస్థాయిలో రిలీజ్​ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 వేల స్క్రీన్లలో ఒకేసారి విడుదల చేయాలనుకుంటున్నారట.

prabhas adipurush movie
ప్రభాస్ ఆదిపురుష్

By

Published : Jan 28, 2022, 11:50 AM IST

Prabhas adipurush: 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ చిత్రాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. దీంతో ఆయన సినిమాలను రిచ్​గా తీర్చిదిద్దేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు పెడుతున్నారు. అలా భారీ బడ్జెట్‌తో తీస్తున్న ప్రభాస్‌ చిత్రాల్లో ఒకటి 'ఆదిపురుష్‌'. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటించారు. బాలీవుడ్ నటి కృతిసనన్‌ సీత పాత్రలో కనిపించగా, నటుడు సైఫ్‌ అలీఖాన్‌ లంకేశుడిగా కనిపిస్తున్నారు.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్‌' బడ్జెట్‌, రిలీజ్‌పై కొన్ని ఆసక్తికర విశేషాలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సినిమా మొత్తం బడ్జెట్‌ విలువ రూ.400 కోట్లని సమాచారం. దాదాపు 15 స్వదేశీ, అంతర్జాతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 20,000 థియేటర్లలో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు.. 'ఆదిపురుష్‌'ని పాన్‌ ఇండియా మూవీగా కాకుండా పాన్‌ వరల్డ్‌ మూవీగా పిలుస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details