తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Adipurush release date: 'ఆదిపురుష్' రిలీజ్ చెప్పిన తేదీకే.. - ఆదిపురుష్ డైరెక్టర్

ప్రభాస్​ 'ఆదిపురుష్'(prabhas adipurush) రిలీజ్ డేట్​పై చిత్రబృందం స్పష్టతనిచ్చింది. ఇంతకు ముందే చెప్పినట్లు వచ్చే ఏడాది ఆగస్టు 11నే రిలీజ్ చేస్తామని సోమవారం(సెప్టెంబరు 27) మరోసారి వెల్లడించింది. ఇందులో ఆయన రాముడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.

prabhas adipurush release date
ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ డేట్

By

Published : Sep 27, 2021, 10:02 AM IST

డార్లింగ్ ప్రభాస్ 'ఆదిపురుష్'(adipurush release date) నుంచి అప్డేట్ వచ్చింది. సినిమా రిలీజ్ డేట్​పై స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది ఆగస్టు 11నే త్రీడీలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఓ పోస్టర్​ను కూడా పోస్ట్ చేశారు.

ప్రభాస్ ఆదిపురుష్

రామాయణం ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా(adipurush cast), కృతి సనన్ సీత పాత్రలో(adipurush heroine) కనిపిస్తారు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో దర్శనమివ్వనున్నారు.

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(adipurush director) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్-రెట్రో ఫిల్స్ ప్రొడక్షన్ సంయుక్తంగా 'ఆదిపురుష్'ను(adipurush budget) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. దీనిని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

చిత్రబృందంతో ప్రభాస్

దీనితో పాటే ప్రభాస్ మరో మూడు సినిమాలు చేస్తున్నారు. అందులో 'రాధేశ్యామ్'.. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. 'సలార్' షూటింగ్ దశలో ఉంది. ఇది కూడా వచ్చే ఏడాది ద్వితియార్ధంలో రిలీజ్ చేసే అవకాశముంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్టు-K'(వర్కింగ్ టైటిల్)లోనూ ప్రభాస్ హీరోగా చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథతో ఇది తెరకెక్కుతోంది.

ఇవే కాకుండా పలువురు దర్శకులు ప్రభాస్​కు కథ చెప్పి, సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అవన్నీ ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details