సామాజిక మాధ్యమాల్లో నిత్యం తన హాట్ అందాలతో మత్తెక్కించే బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న ప్రియుడు సామ్ బాంబేను వివాహమాడింది. వీరిద్దరు పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. 'నీతో ఏడు జన్మలు కలిసి నడవాలనుకుంటున్నా' అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది.
ప్రియుడిని పెళ్లాడిన పూనమ్ పాండే - బాలీవుడ్ నటి పూనమ్ పాండే
బాలీవుడ్ నటి, సోషల్ మీడియా సెలబ్రిటీ పూనమ్ పాండే.. తన బాయ్‌ఫ్రెండ్ సామ్ బాంబేను పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకుందీ ముద్దుగుమ్మ.
పూనమ్
మోడలింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించిన పూనమ్.. 'నషా' సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచేది. ఇటీవల జులై నెలలో సామ్‌తో నిశ్చితార్థం చేసుకున్న ఈ భామ తాజాగా పెళ్లి పీటలెక్కింది.
ఇదీ చూడండి డ్రగ్ కేసు: డోపింగ్ టెస్టుకు సంజన, రాగిణి నిరాకరణ!
Last Updated : Sep 11, 2020, 6:57 PM IST