జిల్ జిల్ జిల్ జిగేలు రాణి.. అంటూ 'రంగస్థలం'లో సందడి చేశారు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, పూజాహెగ్డే. ఈ ఇద్దరూ 'ఆచార్య' కోసం జోడీ కట్టే అవకాశాలున్నాయి. చిరంజీవి కథానాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆచార్య'. రామ్‌చరణ్ ఇందులో సిద్ధ అనే ఒక పూర్తిస్థాయి పాత్రని పోషిస్తున్నారు.
'ఆచార్య'లో చెర్రీకి జోడీగా జిగేలు రాణి! - ఆచార్యలో పూజా హెగ్డే
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, పూజా హెగ్డే జోడీగా తెరపై కనువిందు చేయనున్నారని సమాచారం. 'ఆచార్య' సినిమా కోసం చెర్రీ సరసన ఈ స్టార్ హీరోయిన్ ఎంపికైందని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
'ఆచార్య'లో చెర్రీకి జోడీగా జిగేలు రాణి!
ఇందులో చిరంజీవికి జోడీగా కాజల్ నటిస్తున్నారు. రామ్‌చరణ్ సరసన నటించే కథానాయిక విషయంలో పలువురి భామల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. రష్మిక, సాయిపల్లవి, కియారా తదితర పేర్లు వినిపించినా.. ఇప్పుడు పూజా హెగ్డేని ఎంపిక చేసినట్టు సమాచారం. ఆమె తెలుగులో 'రాధేశ్యామ్', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రాల్లో నటిస్తోంది. 'ఆచార్య' ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుపుకొంటోంది.
ఇదీ చూడండి:ముద్దుగుమ్మతో బాలయ్య మాస్ స్టెప్పులు!
Last Updated : Jan 24, 2021, 10:03 AM IST