తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇప్పుడు ప్రభాస్​.. నెక్ట్స్​ సల్మాన్​తో 'లక్కీగర్ల్​' పూజా!

పూజా హెగ్డే.. ఏడాదిన్నరకాలంగా టాలీవుడ్​, బాలీవుడ్​లో వరుస విజయాలు సాధిస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇటీవల వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సినిమాతో మరో స్థాయికి చేరింది పూజ. ఇప్పుడు ప్రభాస్​ సరసన ఆడిపాడుతోన్న ఈ భామ.. త్వరలోనే బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ఖాన్​తో జతకట్టేందుకు సిద్ధమవుతోంది.

POOJA HEGDE NEXT MOVIE WITH BOLLYWOOD HERO SALMAN KHAN
ఇప్పుడు ప్రభాస్​.. నెక్ట్స్​ సల్మాన్​తో 'లక్కీగర్ల్​' పూజా!

By

Published : Mar 31, 2020, 5:59 AM IST

ఇటు దక్షిణాదిలో.. అటు ఉత్తరాదిలో పూజా హెగ్డే పేరు చెబితే చాలు 'లక్కీ గర్ల్‌' అనే పేరే వినిపిస్తోంది. ఏడాదిన్నర కాలంగా ఆమె కెరీర్‌ను ఓసారి పరిశీలిస్తే దాదాపు ఐదు భారీ విజయాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇటీవల 'అల.. వైకుంఠపురములో' చిత్రంతోనూ ఓ అదిరిపోయే విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఇప్పుడీ అమ్మడి చేతిలో ఉన్నవన్నీ కూడా బడా చిత్రాలే.

త్వరలో సల్మాన్​ఖాన్​తో

ప్రస్తుతం దక్షిణాదిలో ప్రభాస్‌ సరసన ఆడిపాడుతోన్న ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌తో జోడీ కట్టేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటిస్తూ.. ఈ రెండు చిత్రాల్లోని తన పాత్రలకు సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలియజేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఆమె.. ప్రభాస్‌ - సల్మాన్‌ వంటి అగ్ర హీరోలకు జోడీగా చేస్తున్న విషయంలో సంతోషం వ్యక్తం చేసింది.

తమిళ్​లోనూ..

"నిజంగా నాకిదంతా కలలా ఉంది. నేనెప్పుడూ చిత్ర పరిశ్రమలోకి రావాలని అనుకోలేదు. అలాంటిది ఇక్కడే స్థిర పడ్డా. బాలీవుడ్‌లో తొలి అడుగులోనే నా కలల కథానాయకుడు హృతిక్‌ రోషన్‌ సరసన 'మొహంజోదారో'లో నటించే అదృష్టం దక్కింది. ఇప్పుడు ప్రభాస్‌, సల్మాన్‌ వంటి స్టార్లతో చేస్తున్నా. సల్మాన్‌తో చెయ్యబోయే చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్లేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేను. కానీ, ఆ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. పూర్తి వినోదాత్మక కథతో రూపొందుతోన్న చిత్రమది. సల్మాన్‌ను ఆయన అభిమానులు ఇంత వరకు చూడని కొత్త కోణంలో చూడబోతున్నారు. నా పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీని గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు. ఇక ప్రభాస్‌ చిత్ర విషయానికొస్తే.. ఇటీవలే జార్జియాలో చిత్రీకరణ కీలక షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. రాధాకృష్ణ కథ చెప్పినప్పుడే కచ్చితంగా ఈ సినిమా చెయ్యాలని నేను ఫిక్సైపోయా. నా పాత్రలో, సినిమాలోని ప్రేమకథలో అంత వైవిధ్యం ఉంటుంది. త్వరలోనే తమిళ్‌లో ఓ సినిమా చెయ్యబోతున్నా. అది చర్చల దశలో ఉంది. ఆ శుభవార్తను అధికారికంగా నేనే ప్రకటిస్తా" అని చెప్పుకొచ్చింది పూజా.

ఇదీ చదవండి:తారక్ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్​లోకి ఎంట్రీ!

ABOUT THE AUTHOR

...view details