బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌పై పోలీసు కేసు నమోదైంది. తన ప్రెగ్నెన్సీ అనుభవాల ఆధారంగా రాసిన ఓ పుస్తకాన్ని కరీనా ఇటీవల విడుదల చేసింది. ఆ బుక్ టైటిల్, తమ మతం మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందని ఓ సంఘానికి సంబంధించిన వ్యక్తులు ఫిర్యాదు చేశారు.
ఇంతకీ ఏమైంది?
ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో బిడ్డకు జన్మనిచ్చిన ముద్దుగుమ్మ కరీనా.. అతడికి 'జే' అనే పేరు పెట్టినట్లు ఈ మధ్య వెల్లడించింది. తనకు రెండుసార్లు ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో ఎదురైన మానసిక, శారీరకంగా ఎదురైన సమస్యలను 'ప్రెగ్నెన్సీ బైబిల్' అనే పుస్తకంగా రాసింది. దానిని జులై 9న విడుదల చేసింది. ఇది తనకు మూడో బిడ్డలాంటిదని కరీనా చెప్పుకొచ్చింది.