బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్(Dilip Kumar)(98) కన్నుమూశారు. శ్వాసకోస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన.. ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ram Nath Kovind), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi) సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిలీప్ కుమార్‌కు నివాళులు అర్పిస్తున్నారు.
"నటనతో ఖండాంతర అభిమానాన్ని సంపాందించున్నారు దిలీప్ కుమార్. ఆయన మరణంతో శకం ముగినట్లైంది. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా సంతపాన్ని తెలియజేస్తున్నా".
- రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
"ప్రముఖ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు దిలీప్ కుమార్ మృతి తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఆయన మరణంతో భారతీయ చిత్రసీమకు తీరని లోటు'.
- వెంకయ్య నాయుడు, ఉప రాష్ట్రపతి
"దిలీప్ కుమార్.. సినిమా లెజెండ్‌గా ఎప్పటికి గుర్తుండిపోతారు. అసమానమైన నటనతో ఎన్నో తరాల ప్రేక్షకులను అలరించారు. ఆయన కన్నుమూయడం సినీ ప్రపంచానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను".
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
"వెండితెర లెజెండ్ దిలీప్ కుమార్ మృతితో భారతీయ చిత్రసీమకు తీరని లోటు. తన అద్భుతమైన నటన, ఐకానిక్ పాత్రలతో తరాల సినీ ప్రేక్షకులను అలరించారు. దిలీప్ కుమార్ కుటుంబానికి, ఆయన అభిమానులకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నా".
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
"దిలీప్ కుమార్ మృతి నన్ను బాధించింది. భారతీయ సినిమా ఆకర్షించిన గొప్ప నటుల్లో ఆయన ఒకరు. తన నటనతో అనేక తరాల ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను".
- చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
"చిత్రసీమ నుంచి ఓ సంస్థ తరలిపోయింది. భారతీయ సినిమా చరిత్రను రాస్తే.. అది దిలీప్ కుమార్ ముందు, దిలీప్ కుమార్ తర్వాత అని ఉండాలి. ఆయన మరణం నన్ను చాలా బాధించింది. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా సంతాపాన్ని ప్రకటిస్తున్నా".