తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరంజీవి, నాగార్జునను ప్రశంసిస్తూ ప్రధాని ట్వీట్​

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సినీప్రముఖులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు కోటి స్వరపరచిన పాటలో మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ చిరంజీవి, నాగార్జున, వరుణ్​తేజ్​, సాయి​ తేజ్​లు ఆలపిస్తున్న వీడియోను విడుదల చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్​ వేదికగా స్పందించారు.

PM Modi appriciates chiru and Nagarjuna Team For awareness the people about corona
చిరంజీవి, నాగార్జునను ప్రశంసిస్తూ ప్రధాని ట్వీట్​

By

Published : Apr 4, 2020, 12:18 PM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ తెలుగు రాష్ట్రాల్లోనూ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ స్టార్లు, సంగీత దర్శకులు, గాయకులు తమ పాటలతో ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ కథానాయకులు చిరంజీవి, నాగార్జునతోపాటు యువ కథానాయకులు సాయితేజ్‌, వరుణ్‌ తేజ్‌ ఓ పాటలో నటించారు. దీనిపై ప్రధాని మోదీ తాజాగా ట్విట్టర్‌లో స్పందించారు.

"చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి తేజ్ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్లల్లోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్​పై విజయం సాధిద్దాం" అంటూ తెలుగులో ట్వీట్‌ చేశారు మోదీ. #ఇండియాఫైట్స్​కరోనా అనే హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా జత చేశారు. ఈ ట్వీట్​ను రీట్వీట్​ చేస్తూ మెగాస్టార్​ చిరంజీవి, వరుణ్​తేజ్, సాయి తేజ్​​.. మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

లాక్‌డౌన్‌ కారణంగా రోజువారీ చిత్రీకరణలు నిలిచిపోవడం వల్ల సినిమా కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వారిని ఆదుకునేందుకు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి అధ్వర్యంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సి.సి.సి) ఏర్పాటైంది. దీని కోసం పరిశ్రమ వర్గాల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. దీనికి చిత్రపరిశ్రమ నుంచి మంచి స్పందనే వస్తోంది. దీనిపై మరింత అవగాహన కల్పించేలా సంగీత దర్శకుడు కోటి స్వరపరిచిన పాట వీడియోలో చిరు, నాగ్‌, వరుణ్‌తేజ్‌, సాయితేజ్‌ కనువిందు చేశారు.

ఇదీ చూడండి.. సోనాక్షి- అర్జున్​​ విడిపోవడానికి కారణమేంటి!

ABOUT THE AUTHOR

...view details