పీటర్ హెయిన్స్.. ఫైట్ మాస్టర్‌గా చిత్రసీమలో చెరగని ముద్రవేశాడు. ముఖ్యంగా రాజమౌళి సినిమాలకు పోరాటాలు తెరకెక్కించే పీటర్ హెయిన్స్ త్వరలో మెగాఫోన్ పట్టనున్నాడు. నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) పీటర్‌ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడు.
"పీటర్ హెయిన్స్ చెప్పిన కథ వినగానే నచ్చింది. ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా వివరించారు. అందుకే వెంటనే ఓకే చెప్పేశాను. హీరోహీరోయిన్లు ఎవరనేది త్వరలో వెల్లడిస్తాను. దసరాకు లాంఛనంగా ప్రారంభిస్తాను" -నల్లమలుపు శ్రీనివాస్, నిర్మాత