తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'హీరోయిన్లను అలా చూసే రోజులు పోయాయి' - telugu cinema news

'ఏ1 ఎక్స్​ప్రెస్' సినిమాలో నటిస్తున్న హీరోయిన్​ లావణ్య త్రిపాఠి.. తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో సినీ పరిశ్రమ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

People dont take gamour seriously said Lavanya tripathi
'హీరోయిన్లను అలా చూసే రోజులు పోయాయి'

By

Published : Dec 20, 2019, 2:11 PM IST

'అందాల రాక్షసి' సినిమాతో హీరోయిన్​గా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టింది లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది. ఈమె నటించిన 'అర్జున్ సురవరం'.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం సందీప్​ కిషన్​తో కలిసి 'ఏ1 ఎక్స్​ప్రెస్'​లో హాకీ ప్లేయర్​గా అలరించనుంది. ఇటీవలే ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఈ భామ.. సినీ పరిశ్రమ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రేక్షకులు.. హీరోయిన్ల గ్లామర్​ను పట్టించుకొనే రోజులు పోయాయని చెప్పింది.

"టాలీవుడ్‌లో కథానాయికలను కేవలం గ్లామర్ గర్ల్​గా చూసే రోజులు పోయాయి. ఎక్కువ మంది రచయితలు, దర్శక నిర్మాతలు హీరోయిన్​ ఓరియెంటెడ్​కు సంబంధించిన కథలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రేక్షకులూ.. హీరోయిన్ల నటనను ఆస్వాదించేందుకే ఇష్టపడతున్నారు"

-లావణ్య త్రిపాఠి, హీరోయిన్

'ఏ1 ఎక్స్​ప్రెస్'​.. తెలుగులో హాకీ నేపథ్యంలో రాబోతున్న తొలి సినిమా. హిప్​ హాప్ తమిజ సంగీతం సమరకూర్చనున్నాడు. డెన్నిస్​ జీవన్​ దర్శకుడు. ఇందులో లావణ్య.. హాకీ క్రీడాకారిణిగా కనిపించనుంది.

A1 ఎక్స్​ప్రె్స్​లో లావణ్య త్రిపాఠి

ABOUT THE AUTHOR

...view details