భారతీయ తొలి ఫైటర్ పైలట్ పాత్రలో కనిపించబోతోంది హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ప్రస్తుతం 'నరేంద్ర'లో నటిస్తోంది. జయంత్.సి.పరాన్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలోనే పాయల్ ఫైటర్ పైలట్ పాత్రను చేస్తోంది.
ఫైటర్ పైలట్‌గా ముద్దుగుమ్మ పాయల్ - entertainment news
ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్.. ఫైటర్ పైలట్‌గా ఎలాంటి సాహసాలు చేసిందో తెలియాలంటే 'నరేంద్ర' సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం.
పాయల్ రాజ్‌పుత్
"అమాయకుడైన ఒక భారతీయ బాక్సర్ పాకిస్థాన్ జైలులో ఎలా బందీ అయ్యాడు? అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నాడనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రమిది. కథానాయకుడిగా పరిచయమవుతున్న నీలేష్.. ఇందులో బాక్సర్‌గా కనిపిస్తాడు. ఇసాబెల్లే మానవ హక్కుల కార్యకర్త పాత్రలో నటిస్తోంది" అని చిత్రవర్గాలు తెలిపాయి.
Last Updated : Feb 28, 2020, 11:28 PM IST