వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన చిత్రం 'వకీల్‌సాబ్'. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను పంచుకుంది చిత్రబృందం. ఇందులో కోర్టు సన్నివేశాన్ని దర్శకుడు వేణు.. పవన్‌కు వివరిస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతోపాటు షూటింగ్ స్పాట్లో వారిద్దరు సరదాగా ముచ్చటిస్తున్న ఫొటోలను పంచుకుంది.
ఆకట్టుకుంటున్న 'వకీల్‌సాబ్' వర్కింగ్ స్టిల్స్ - pawankalyan vakeelsaab
ఏప్రిల్ 9న 'వకీల్‌సాబ్' సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను పంచుకుంది చిత్రబృందం. ఇందులో పవన్‌కల్యాణ్, దర్శకుడు వేణు శ్రీరామ్ ఉన్నారు. ఆ చిత్రాలను మీరూ ఓ సారి చూసేయండి..
వకీల్‌సాబ్
బోనీకపూర్ సమర్పణలో ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించారు. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీత దర్శకుడు.
ఇదీ చూడండి: 'వీరమల్లు'లో యుద్ధ సన్నివేశాల కోసం పవన్ కసరత్తు