తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వకీల్​సాబ్​' సెన్సార్​ పూర్తి.. పాటతో బ్యాచ్​లర్ - marakkar mohanlal movie

పవన్​కల్యాణ్​ 'వకీల్​సాబ్​' చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్​ను జారీ చేసింది సెన్సార్​ బోర్డు. అఖిల్​, పూజాహెగ్డే నటించిన 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్'​ సినిమాలోని మరో పాట విడుదలై ఆకట్టుకుంటోంది.

vakeelsaab
వకీల్​సాబ్​

By

Published : Apr 5, 2021, 5:36 PM IST

పవర్​స్టార్ పవన్​కల్యాణ్ 'వకీల్​సాబ్'​ సెన్సార్​ పూర్తి చేసుకుని, యూబైఏ సర్టిఫికెట్​ సొంతం చేసుకుంది. బాలీవుడ్‌ హిట్ 'పింక్‌' రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. బోనీకపూర్‌ సమర్పణలో దిల్‌రాజు నిర్మించారు. అంజలి, నివేదా థామస్‌, అనన్య కీలక పాత్రలు పోషించారు. ఇందులో పవన్‌ న్యాయవాదిగా కనిపించనున్నారు. తమన్‌ సంగీత దర్శకుడు. ఏప్రిల్​ 9న థియేటర్లలో విడుదల కానుందీ సినిమా.

వకీల్​సాబ్​

అక్కినేని అఖిల్​, పూజా హెగ్డే జంటగా నటించిన 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్'​ సినిమాలోని 'యే జిందగీ' పాట విడుదలైంది. ఈ గీతం శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. జూన్ 19న థియేటర్లలోకి రానుంది.

మోహన్​లాల్ 'మరాక్కర్' సినిమాలోని 'కల్లనిండా కలలు' పాట టీజర్​ విడుదలైంది. ప్రియదర్శన్​ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. మే 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇదీ చూడండి:'దిగువ మధ్య తరగతి జీవితం గడపాలనుకున్నా'

ABOUT THE AUTHOR

...view details